రాష్ట్రంలోనే మదనపల్లె తర్వాత అత్యంత పెద్దదైన కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమోటాకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కూలీ ధరలు కూడా రాక చాలామంది పొలంలోనే పంటను వదిలేస్తుండగా.. అష్టకష్టాలు పడి మార్కెట్‌కు తరలించిన రైతులు దళారీల చేతిలో మోసపోతున్నారు. వ్యాపారులంతా కుమ్మక్కై.. ధర తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. స్థానిక నాయకులు, అధికారులు సైతం వ్యాపారులకే మద్దతు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 కిలోల బరువున్న టమోటా గంప కేవలం 80 రూపాయలకు కొనుగోలు చేస్తుండటంతో.. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు.
FARMERS PROBLEM: దళారీల ఆగడాలు.. చితికిపోతున్న టమోటా రైతులు - Pattikonda Agricultural Market Latest Information
పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో దళారీల చేతిలో టమోటా రైతులు చితికిపోతున్నారు. స్థానిక నాయకులు, అధికారులు కూడా వారికే మద్దుతు ఇస్తున్నారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కనీసం కూలీ, రవాణా ఖర్చులు కూడా దక్కటం లేదని వాపోయారు.
పత్తికొండ వ్యవసాయ మార్కెట్