వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయాలని కర్నూలు జిల్లా బేతంచర్ల మండల వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. శనివారం కొంతమంది రైతులకు 20 కిలోల వేరుశెనగ బస్తాలను అధికారులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఉదయం పెద్దఎత్తున చేరుకుని అధికారులను నిలదీశారు. ఇప్పటికే పంపిణీ పూర్తిచేశామని చెప్పటంతో... ధర్నాకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి... పరిస్థితిని అదుపుచేశారు.
వేరు శెనగ విత్తనాల కోసం రైతులు ధర్నా - కర్నూల్ జిల్లా
కర్నూలు జిల్లా బేతంచర్లలో రైతులు వ్యవసాయ అధికార కార్యాలయాన్ని చుట్టుముట్టారు. రైతులందరూ రావటంతో కార్యలయం రద్దీగా మారింది.
వ్యవసాయ అధికార కార్యాలయం వద్ద రైతులు
ఇదీ చదవండి:ఉత్కంఠ నడుమ అనంత సాగునీటి సలహా మండలి భేటీ