ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్యేక హోదా సాధించడంలో వైకాపా చేతులెత్తేసింది: అఖిల ప్రియ - హోదా సాధించడంలో వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసింది: భూమా అఖిల ప్రియ

వైకాపా ప్రభుత్వంపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం మాని రాష్ట్రం మొత్తాన్ని ప్రధాని మోదీ కాళ్ల కిందకి తెచ్చారని పేర్కొన్నారు.

bhuma Akhila priya comments on ycp government
హోదా సాధించడంలో వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసింది: భూమా అఖిల ప్రియ

By

Published : Nov 7, 2020, 9:50 PM IST

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. గత ఎన్నికల ప్రచారంలో అధిక ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న జగన్... ఇప్పుడు ఘోరంగా విఫలమయ్యరన్నారు. నేడు ప్రధాని మోదీ కాళ్లు పట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.

వైకాపా ఎమ్మెల్యేలు చేస్తున్న పాదయాత్రలు పార్టీ కోసమా, ప్రజల కోసమా అని అఖిల ప్రియ ప్రశ్నించారు. గృహ నిర్మాణాల కోసం ఇసుక అందుబాటులో లేక ప్రజలు అల్లాడిపోతున్నా.. ఈ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చమని వైకాపా అంటోందని, క్షేత్రస్థాయిలో దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details