ఓ రైతు తనకు వచ్చిన కరెంటు బిల్లు చూసి షాక్‌కి గురయ్యాడు. కర్నూలు సమీపంలోని ఉల్చాల గ్రామానికి చెందిన ఆంజనేయులుకు నెలకి రెండు వందల రుపాయలకు మించి కరెంటు బిల్లు వచ్చేది కాదు. ఇంట్లో రెండు ఫ్యాన్లు, ఫ్రిజ్, మూడు బల్బులు మాత్రమే ఉన్నాయి. కరోనా నేపథ్యంలో రెండు నెలల కరెంటు బిల్లు దాదాపు యాభై వేల రుపాయలు వచ్చింది. బిల్లు చూసి అయోమయానికి గురయ్యాడు. బిల్లు తగ్గించాలని కర్నూలుకు వచ్చి అధికారులకు విన్నవించుకున్నాడు.
రూ.50 వేలు కరెంటు బిల్లు..షాకైన రైతు
ఆ సాధారణ రైతుకు కరెంటు బిల్లు ఎప్పుడూ మినిమమే వచ్చేది. కానీ ఈసారి వచ్చిన విద్యుత్ బిల్లు చూసి షాక్‌కు గురయ్యాడు. రెండు నెలల కరెంట్ బిల్లు యాభై వేల రూపాయలు వచ్చింది.
రూ.50 వేలు కరెంటు బిల్లు..షాకైన రైతు