ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lucky farmer: ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యాడు! - ఒక్కరోజులో కోటీశ్వరుడైన రైతు తాజా వార్తలు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్న జొన్నగిరిలో ఓ రైతు(farmer) కు అదృష్టం కలిసొచ్చి ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యారు. పొలానికి వెళ్తున్న రైతుకు మెరుస్తున్న రాయి కనిపించింది. తనతోపాటు ఇంటికి తీసుకొచ్చిన రాయిని.. స్థానిక వ్యాపారికి చూపించాడు. అనంతరం ఊహించని పరిణామానికి రైతు ఏం చేయాలో తోచలేదు. ఇంతకీ ఏం జరిగింది..

farmer found a diamond
పొలంలో రైతుకు దొరికిన వజ్రం

By

Published : May 28, 2021, 8:12 AM IST

Updated : May 28, 2021, 10:13 AM IST

ఎప్పుడూ పుడమి తల్లి ఒడిలో ఉంటూ సేద్యం చేసుకునే ఓ రైతుకు అదృష్టం కలిసొచ్చి ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్న జొన్నగిరిలో గురువారం ఓ రైతు పొలానికి వెళ్లగా.. మిలమిలా మెరుస్తున్న రాయి ఆకర్షించింది. వజ్రంగా భావించి ఇంటికి తీసుకువచ్చాడు. స్థానిక వ్యాపారికి చూపించగా రూ.1.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలిసింది.

30 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం(Diamond) మార్కెట్‌ ధర రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఈ విషయం బయటకు పొక్కిన తర్వాత ఇతర వ్యాపారులు చెబుతున్నారు. అంత సొమ్ము ఒక్కసారి చూసిన అన్నదాత.. దక్కిందే అదృష్టంగా భావించి ఇతరులకు తెలియజేయలేదని, వ్యాపారి సైతం గుట్టుగా ఉంచే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Last Updated : May 28, 2021, 10:13 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details