పార్టీ మారనందుకు తమ పొలం తీసుకునేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఓ రైతు ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లా కల్లురు మండలం పుసులూరుకు చెందిన అయ్యస్వామికి 2 ఎకరాల 30 సెంట్ల పొలం ఉంది. దాన్ని అక్రమంగా తీసుకునేందుకు అదే గ్రామానికి చెందిన చిన్న అయ్యస్వామి ప్రయత్నం చేస్తున్నాడని రైతు ఆరోపించాడు.
అధికార పార్టీలోకి రానందుకు తన పొలంలోని పత్తి పంటను తొలగించారని చెప్పాడు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చి కార్యాలయం ముందు కుటుంబసభ్యులతో నిరసన తెలిపాడు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని.. తన పొలం తనకు కావాలని అన్నాడు. భూమికి సంబంధించిన పాసు పుస్తకాలు, దస్తావేజులు అన్నీ ఉన్నాయని.. న్యాయం చేయాలని కోరాడు.