కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామంలో శేఖర్ (42) అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పొలానికి వెళ్లి మోటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భూమిని కౌలుకు తీసుకొని జీవనం సాగించే శేఖర్ మృతి చెందటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. భార్య ఫిర్యాదు మేరకు నందివర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కౌలు రైతు కుటుంబంలో చీకటి నింపిన మోటర్ - కర్నూలు జిల్లాలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన రైతులు తాజావార్తలు
మోటర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కౌలు రైతు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామంలో చోటు చేసుకుంది.
విద్యుత్ షాక్లో రైతు మృతి