కర్నూలు జిల్లా గుంటూరు పట్టణానికి చెందిన గొల్ల రాముడు అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్ల రాముడు తనకున్న ఎకరం పొలంతో పాటు, రెండెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. ఐదు లక్షల రూపాయలు అప్పు చేసి వేసినా పంట సరిగా రాకపోవడంతో.. మనస్థాపానికి గురయ్యాడు. ఇంటి ముందు ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణనానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నట్లు ఎస్సై నాగార్జున తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: