కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం కైప గ్రామంలో అప్పుల బాధ తాళలేక పెద్ద పుల్లయ్య (43) అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న రెండు ఎకరాల పొలంతోపాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. గడిచిన నాలుగేళ్లుగా సరైన పంటలు రాక సుమారు తొమ్మిది లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పు తీర్చలేక ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య సావిత్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు. నందివర్గం ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య - కైపలో రైతు ఆత్మహత్య తాజా వార్తలు
అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం కైప గ్రామంలో జరిగింది.
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య