మృతదేహానికి శవ పరీక్ష వద్దంటూ మృతుడి బంధువులు శవాన్ని తీసుకెళ్లడం కర్నూలు జిల్లా నంద్యాలలో సంచలనమైంది. దొర్నిపాడు మండలం గోవిందిన్నె గ్రామానికి చెందిన నారాయణ(19) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడం వల్ల నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో మృతి చెందాడు. అయితే అనంతరం మృతదేహానికి శవపరీక్ష నిర్వహించాల్సి ఉంది. మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం శవ పరీక్ష వద్దంటూ గొడవకు దిగారు. తమ కుటుంబ సభ్యుడిని పోస్ట్ మార్టం నిర్వహించి.. శరీరాన్ని కోస్తారాని...ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు వైద్యులు శవపరీక్ష నిర్వహించారు.
శవ పరీక్ష వద్దంటూ.. మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లారు..! - postmortem news
ఎవరైనా చనిపోతే.. మృతదేహానికి శవ పరీక్ష తప్పనిసరి. ఓ యువకుడు పురుగుల మందు తాగి మృతి చెందింతే.. కుటుంబ సభ్యులు మాత్రం పోస్టుమార్టం వద్దంటూ.. గొడవకు దిగారు. ద్విచక్రవాహనంపై మృతదేహాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఘటన వివరాలివి..!
శవ పరీక్ష వద్దంటూ.. బైక్పై తీసుకెళ్లారు!
TAGGED:
postmortem news