పోలీసులమంటూ పాన్‌షాప్ నిర్వహకుడిని బెదిరించిన ముగ్గురు వ్యక్తులను కర్నూలు జిల్లా నంద్యాల రెండో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక కేసీ కార్యాలయం సమీపాన గల రహదారిపై పాన్‌షాప్ నిర్వహిస్తున్న మల్లేశ్వరరావు అనే వ్యక్తి గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న విషయాన్ని నిందితులు తెలుసుకున్నారు. అనంతరం షాప్‌వద్దకు వెళ్లి పోలీసులమంటూ కొంత మొత్తాన్ని డిమాండ్ చేశారు. తర్వాత ఇస్తానని చెప్పిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మల్లేశ్వరరావు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
నంద్యాలలో నకిలీ పోలీసులు అరెస్టు - నంద్యాలలో నకిలీ పోలీసులు అరెస్టు
కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులమంటూ పాన్‌షాప్ నిర్వహకుడిని బెదిరించిన ముగ్గురు వ్యక్తులపై రెండో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పాన్‌షాప్ యాజమాని గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న విషయాన్ని తెలుసుకొని నగదు డిమాండ్ చేయగా..పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.

నంద్యాలలో నకిలీ పోలీసులు అరెస్టు