కర్నూలుకు చెందిన రవి కుమార్ అనే వ్యక్తి కొంతకాలంగా ఇంటెలిజెన్స్ డీఎస్పీ అని చెప్పుకుంటూ అమాయకులను మోసం చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలలో వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఇంటెలిజెన్స్ డీఎస్పీగా ఫోన్ చేసేవాడు. కొంత డబ్బు తమ ఖాతాలో జమ చేస్తే మీకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పి వారి నుంచి డబ్బు వసూలు చేసేవాడని కర్నూలు డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు.
కర్నూలులో నకిలీ డీఎస్పీ అరెస్ట్
ఇంటెలిజెన్స్ డీఎస్పీని అని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితునిపై ఆరు కేసులు నమోదయినట్లు కర్నూలు డీఎస్పీ వెంకట్రామయ్య పేర్కొన్నారు.
కర్నూలులో నకిలీ డీఎస్పీ అరెస్ట్
రూ.30 వేలు చెల్లిస్తే మీకు ఏడు లక్షల రూపాయలు వస్తాయనడం వల్ల కొందరు బాధితులు.. రవి కుమార్ చెప్పిన బ్యాంకు ఖాతాకు డబ్బులు చెల్లించేవారు. ఖాతాలో డబ్బులు వేయగానే ఉడాయించేవాడు. నిందితునిపై కేసులు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. అతని నుంచి రూ. 25 వేలు, చరవాణి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:'అఫిడవిట్ దాఖలు చేయండి'... డీజీపీకి హైకోర్టు ఆదేశం