ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ పత్తి విత్తనాల విక్రయం.. వ్యక్తి అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ ఇంట్లో విజిలెన్సు అధికారుల తనిఖీలు చేశారు. ఆదోని మండలం నెట్టేకల్లు గ్రామంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగు క్వింటాళ్ల నకీలి పత్తి విత్తనాలను అధికారులు సీజ్ చేశారు.

fake cotton seeds
నకిలీ పత్తి విత్తనాలు

By

Published : Jun 26, 2021, 1:20 PM IST

ఆదోనిలో కొన్నేళ్లుగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తిని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మండలంలోని నెట్టేకల్లు గ్రామంలో కేశవులు అనే వ్యక్తి కొన్ని ఏళ్లుగా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో శుక్రవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అతని ఇంట్లో తనిఖీలు చేశారు. ఇంట్లో అక్రమంగా ఉన్న నాలుగు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్న అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

వీటి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. విత్తనాల నమూనాలను టెస్టింగ్​కు పంపామని వెల్లడించారు. విత్తనాల వల్ల రైతులకు చాలా నష్టం వస్తుందని.. విజిలెన్సు సీఐ మహేశ్వర రెడ్డి అన్నారు. నకిలీ పత్తి విత్తనాలు ఎవరైనా అమ్ముతున్నారని తెలిస్తే 9177788839 నెంబర్​కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details