ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. 2 కోట్ల రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. పత్తి విత్తనాలతో పాటు.. పురుగు మందులు, గుట్కా, పాన్ మసాలా, టీ, డిటర్జెంట్లు సహా పలు రకాల బ్రాండ్లకు చెందిన నకిలీ ప్యాకింగ్ కవర్లను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తయారీకి వినియోగిస్తున్న 683 సిలిండర్లు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.
Fake cotton Seeds Seized: నకిలీ పత్తి విత్తనాల తయారీ ముఠా అరెస్ట్ - నకిలీ దందా గుట్టు రట్టు
తెలుగు రాష్ట్రాలతో సహా కర్ణాటకలోనూ నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తూ.. రైతులను మోసం చేస్తున్న ముఠాను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. 2 కోట్ల రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పత్తివిత్తనాల ముఠా గుట్టు రట్టు