ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ ఆధార్, పాన్ కార్డు తయారీ ముఠా అరెస్ట్ - కర్నూలులో నకిలీ ఆధార్ ముఠా అరెస్టు

నకలీ పాన్ కార్డులు, ఆధార్ కార్డుల్లో డేటా మార్చే ముఠాను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. అనర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించే విధంగా అధార్ కార్డుల్లో డేటా మారుస్తున్నారని జిల్లా ఎస్పీ డాక్టర్. ఫక్కీరప్ప తెలిపారు.

Fake Aadhaar, PAN card manufacturing gang arrested at karnool
నకిలీ ఆధార్, పాన్ కార్డు తయారీ ముఠా అరెస్ట్

By

Published : Oct 28, 2020, 5:14 PM IST

అనర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించే విధంగా ఆధార్ కార్డుల్లో డేటా మార్చే ముఠా సభ్యులను కర్నూలులో పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 మంది ఆధార్ కార్డుల్లో వయస్సు మార్చుతూ.. నకిలీ పాన్ కార్డులు తయారు చేస్తూ పోలీసులకు చిక్కారు.

ఈ ముఠా సభ్యులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అనర్హులకు నకీలీ పాన్ కార్డులు ఆధారంగా వయస్సును మర్చి అర్హులుగా చేసేవారని జిల్లా ఎస్పీ డాక్టర్. ఫక్కీరప్ప తెలిపారు. ఈ కేసులో భారీగా కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. మరింత విచారణ జరిపి ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉంటే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details