కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని నల్లమల అడవుల్లో ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మహాదేవపురం, కోటకొండ గ్రామాల మధ్య తెలుగు గంగ కాలువ వెంట సోదాలు నిర్వహించిన పోలీసులు నాటు సారా బట్టీలను గుర్తించారు. 20 డ్రమ్ముల్లో తయారీకి సిద్ధంగా ఉన్న సారా ఊటను ధ్వంసం చేశారు. గిరిజనులు సారా తయారీకి దూరంగా ఉండాలని, నవోదయం కార్యక్రమంలో వారు భాగస్వాములు కావాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శివశంకర్ రెడ్డి కోరారు. తయారీదారులను గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.
ఆళ్లగడ్డలో నాటుసారా ఊట ధ్వంసం చేసిన ఎక్సైజ్ పోలీసులు - Excise police raid latest news update
గిరిజనులు నాటు సారా తయారీకి దూరంగా ఉండాలని, నవోదయం కార్యక్రమంలో వారు భాగస్వాములు కావాలని ఎక్సైజ్ సూపరిండెంట్ శివశంకర్ రెడ్డి కోరారు. కర్నూలు జిల్లా మహాదేవపురం, కోటకొండ గ్రామాల మధ్య తెలుగు గంగ కాలువ వెంట సోదాలు నిర్వహించిన పోలీసులు నాటు సారా బట్టీలను ధ్వంసం చేశారు.
![ఆళ్లగడ్డలో నాటుసారా ఊట ధ్వంసం చేసిన ఎక్సైజ్ పోలీసులు Excise police raid in Natusara batti destroyed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5927917-210-5927917-1580611031485.jpg)
ఆళ్లగడ్డలో నాటుసారా ఉట ధ్వంసం
Last Updated : Feb 2, 2020, 12:09 PM IST