గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఆరుగురిని కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కోడుమూరు నియోజకవర్గంలోని పాత పొన్నకల్లు గ్రామంలో ఈనెల 11న ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద గుప్తనిధులు ఉన్నయని జేసీబీ సహాయంతో తవ్వకాలు చేపట్టారు. ఘటనకు సంబంధించి గ్రామ తలారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి జేసీబీ వాహనం తోపాటు రెండు ద్విచక్ర వాహనాలు 10వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అప్పులు తీర్చేందుకు గుప్త నిధులు కోసం ఈ తవ్వకాలు జరిపినట్లు వెల్లడించిన డీఏస్పీ నిందితుల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉన్నట్లు తెలిపారు.
గుప్త నిధులు కోసం తవ్వకాలు.. నిందితుల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ - today kurnool district news update
కర్నూలు జిల్లాలో గుప్త నిధులు కోసం తవ్వకాలు జరపటం కలకలం రేపింది. అప్పులు తీర్చేందుకు స్థానికంగా ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం వద్ద నిధులు ఉన్నాయని నిందితులు జేసీబీ సహాయంతో తవ్వకాలు జరిపారు. వీరిలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
గుప్త నిధులు కోసం తవ్వకాలు జరిపిన నిందితులు అరెస్టు
ఇవీ చూడండి...