Ex-servicemen protest in Kurnool: దేశ రక్షణ కోసం సేవలందించిన వారి సేవలకు గుర్తుగా మాజీ సైనికులకు 2011 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో ఒక్కొక్కరికి 5సెంట్ల భూమిని కేటాయించింది. వారికి కేటాయించిన స్థలాల్లో కాంపౌండ్ గోడలతో పాటు, ఆర్థిక స్తోమత ఉన్నవారు ఇళ్లు కట్టుకున్నారు. అయితే, మాజీ సైనికులకు ఇచ్చిన భూమి పట్టాలు నకీలీవని ఇప్పుడు ఎమ్మార్వో అంటున్నారని.. తగిన పట్టాలతో రావాలని చెప్పినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు ఈ స్థలాల్లో నిర్మించిన గోడలను పడేశారని, వివరణ కోరగా ఇవి నకిలీ పట్టాలని తెలిపారని బాధితులు.. ఆరోపిస్తూ కలెక్టరెట్ వద్ద ధర్నా చేపట్టారు.
అప్పటి ప్రభుత్వం పట్టాలిస్తే.. ఇప్పటి ప్రభుత్వం నకీలీవంటూ..! - సైనికుడి భూమి ఆక్రమణ వివరాలు
Ex-servicemen protest: కర్నూలు కలెక్టరేట్ ఎదుట మాజీ సైనికులు ఆందోళన చేపట్టారు. మాజీ సైనికులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలానికి సంబంధించి నకిలీ పట్టాలని ఎమ్మార్వో తెలిపినట్లు.. బాధితులు వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలకే భద్రత లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని వారు నిలదీశారు.
మాజీ సైనికులు
తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. సుమారు 300 మంది మాజీ సైనికులకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారని, వాటిని ఇప్పుడు నకీలీవి అంటూ ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మాజీ సైనికుల స్థలాలకే భద్రత లేకుంటే సామన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందన్నారు. అధికారులు స్పందించి తమకు ఇచ్చిన స్థాలాన్ని తిరిగి తమకే కేటాయించాలని వారు కోరుతున్నారు.
ఇవీ చదవండి: