ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు అమరావతిని రాజధానిగా అంగీకరించి... ఇప్పుడు పాలన వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానులు చేయడం సరికాదని బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. కర్నూలుకు హైకోర్టు రావడం వల్ల ఇక్కడ ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. రాజధాని కోసం వేల ఎకరాల భూమి ఇచ్చిన వారి త్యాగానికి న్యాయం జరుగుతుందన్నారు.
'కర్నూలుకు హైకోర్టు రావడం వల్ల ఇక్కడి ప్రజలకేం ప్రయోజనం లేదు'
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.
'కర్నూలుకు హైకోర్టు రావడం వల్ల ఇక్కడి ప్రజలకేం ప్రయోజనం లేదు'