ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నేతన్న నేస్తం పథకం అర్హులకు అందటంలేదు' - నేతన్న నేస్తం పథకంపై విమర్శలు

నేతన్న నేస్తం పథకంలో అర్హులను కాకుండా అనర్హులను లబ్ధిదారులుగా గుర్తించారని ఎమ్మిగనూరు మాజీఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో స్కీముల పేరిట స్కాములు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.

'నేతన్న నేస్తం పథకం అర్హులకు అందటంలేదు'
'నేతన్న నేస్తం పథకం అర్హులకు అందటంలేదు'

By

Published : Jul 4, 2020, 4:12 PM IST

అర్హులైన చేనేతలకు నేతన్న నేస్తం పథకం అందలేదని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మాజీఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి విమర్శించారు. చేనేతపురిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అర్హులను కాకుండా అనర్హులను లబ్ధిదారులుగా గుర్తించారని ఆరోపించారు.

రాష్ట్రంలో స్కీములు పేరిట స్కాములు జరుగుతున్నాయని జయనాగేశ్వర రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం బీసీ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ... కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details