రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తెదేపా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విజయవాడలో కలిశారు. కర్నూలు జిల్లా పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.
ఆళ్లగడ్డలో వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని అఖిలప్రియ ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల అరాచకాలపై ఎస్ఈసీకి పూర్తిగా వివరించానని చెప్పారు. తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.