రైతులను మోసం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తోందని మాజీ మంత్రి అఖిల ప్రియ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే... ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని దుయ్యబట్టారు. కొన్నాళ్ల తరువాత విద్యుత్ ఛార్జీలు భరించలేమని ప్రభుత్వం చేతులెత్తేస్తే రైతుల పరిస్థితి ఏంటని ఆమె నిలదీశారు.
'రైతులను మోసం చేసేందుకే వ్యవసాయ మోటార్లుకు మీటర్లు'
వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయంలో పెద్ద మోసం జరుగుతోందన్నారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. తెలంగాణ ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తుంటే... ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని దుయ్యబట్టారు.
కర్షకులెవరూ అధికారులు మాటలు విని మోసపోవద్దని సూచించారు. కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన అఖిల ప్రియ... వైకాపా సర్కార్‌పై మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో ఈ ఏడాది మూడుసార్లు వరదలు వచ్చి రైతులు నష్టపోతే ఇంతవరకు పరిహారం చెల్లించలేదని అన్నారు.
భూముల కొనుగోలు వ్యవహారంలో మంత్రి గుమ్మనూరు జయరాం ఇరుక్కుపోయారని... ఈఎస్ఐ స్కాంలో ఆయనకు ప్రమేయం ఉందని అఖిల ప్రియ ఆరోపించారు. ఆధారాలను బయటపెడుతున్నా మంత్రులపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.