.
'అన్ని స్థానాల్లో తెదేపా శ్రేణులు పోటీ చేయాలి' - సోమిశెట్టి వెంకటేశ్వర్లు
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు పోటీ చేయాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్నూల్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం, డబ్బు గురించి మాట్లాడుతున్న సీఎం... మద్యం దుకాణాలను ఎన్నికల ముగిసే వరకు మూసివేయాలని సవాల్ విసిరారు. అధికార పార్టీకి కొమ్ము కాయకుండా ఎన్నికలు నిర్వహించాలని అధికారులను కోరారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని తెదేపా జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ