కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనగల కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ప్రారంభించింది. ఈ రబీ సీజన్లో జిల్లాలో రెండు లక్షల పంతొమ్మిది వేల హెక్టార్లలో శనగ పంటను సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో ఈ సారి దిగుబడి అధికంగా వచ్చింది. ప్రభుత్వం రైతులకు క్వింటాకు 4875 రూపాయల మద్దతు ధర అందిస్తోంది. ఒక్కో రైతు నుంచి గరిష్ఠంగా వంద క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని, సరకు కొనుగోలు చేసిన 15 రోజుల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేస్తామని కర్నూలు జిల్లా మార్క్ఫెడ్ ఎండీ సురేష్కుమార్ అన్నారు 'ఈ క్రాపింగ్' ఉండటంతో కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు ఉండవని ఆయన తెలిపారు.
కర్నూలు జిల్లాలో శనగల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - markfed
కర్నూలు జిల్లాలో శనగల కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ప్రారంభించింది. ఈ విధానంలో ఒక్కో రైతు నుంచి వంద క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసి, 15రోజుల్లోనే నగదును జమ చేయనున్నారు.
కర్నూలు జిల్లాలో శనగల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం