ఎమ్మిగన్నూరులో పోటాపోటీగా తెదేపా, భాజపా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి 19, 20 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబును గెలిపించి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు. తెదేపా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. 12,13 వార్డుల్లో భాజపా అభ్యర్థి కేఆర్ మురహరి రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వివరించారు. భాజపానే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి.