ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాల, ఎమ్మిగనూరులో ఈడీ సోదాలు..ఉద్రిక్త పరిస్థితులు

కర్నూలు జిల్లా నంద్యాలలో ఈడీ సోదాలు నిర్వహించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థలో పని చేస్తున్న వ్యక్తుల ఇళ్లల్లో.. సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

నంద్యాలలో ఈడీ సోదాలు
నంద్యాలలో ఈడీ సోదాలు

By

Published : Mar 23, 2021, 3:10 PM IST

Updated : Mar 23, 2021, 5:13 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో పలుచోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు చేపట్టింది. నంద్యాల పట్టణంలోని పలువురి ఇళ్లతో పాటు, కానాల, అయ్యలూరు గ్రామాల్లో ఈ సోదాలు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ (మత స్వచ్ఛంద సంస్థ)లో పని చేస్తున్న వ్యక్తుల ఇళ్లల్లో ఈ సోదాలు నిర్వహించారు. సమాచారం అందుకున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు.. అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. కావాలనే భాజపా, ఆర్ఎస్ఎస్ ఇలా దాడులు చేయిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, సిబ్బంది మధ్య వాగ్వాదం జరగటంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎమ్మిగనూరులో

జిల్లాలోని ఎమ్మిగనూరుకు చెందిన మహమ్మద్ రసూల్ అనే వ్యక్తి.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో పని చేశాడు. మహమ్మద్ ఇంట్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈడీ సోదాలు నిర్వహించింది. ఇతడు కొన్నేళ్లుగా అరబ్ దేశాల్లో పని చేసి.. కొన్నిరోజుల క్రితం సొంతూరుకు వచ్చాడు. ఇతని బ్యాంక్ ఖాతా ద్వారా అధికంగా లావాదేవీలు నిర్వహించడంతో.. ఈడీ అధికారి విచారణ జరిపినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో.. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహించింది.

ఇదీ చదవండి:

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ఎస్​ఈసీని ఆదేశించలేం: హైకోర్టు

Last Updated : Mar 23, 2021, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details