ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైల దేవస్థాన ఉద్యోగులను విధుల్లో చేర్చుకోవాలని దేవాదాయ శాఖ ఉత్తర్వులు

శ్రీశైల దేవస్థానంలో ఆర్జిత సేవల్లో అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న 9మంది ఉద్యోగులను... పెండింగ్‌ ఎంక్వైరీ కింద విధుల్లో చేర్చుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసులో అనిశా చేపట్టిన విచారణ ముగియటంతో న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు దేవాదాయశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

endowment department orders that srisailam temple employees should be included in the duties
శ్రీశైల దేవస్థాన ఉద్యోగులను విధుల్లో చేర్చుకోవాలి... దేవాదాయ శాఖ ఉత్తర్వులు

By

Published : Dec 6, 2020, 11:25 AM IST

శ్రీశైల దేవస్థానంలో ఆర్జిత సేవల్లో అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న 9మంది ఉద్యోగులను పెండింగ్‌ ఎంక్వైరీ కింద విధుల్లో చేర్చుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆర్జిత సేవల కుంభకోణం కేసులో 42 మంది ఉద్యోగులను అనిశా విచారించింది. విచారణ ముగియడంతో తమను విధుల్లోకి తీసుకోవాలని 9 మంది హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు దేవాదాయశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 2016-2020 మధ్య రూ.2.56 కోట్ల కుంభకోణం జరిగిందని దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ గుర్తించారు. పోలీసులు రూ.80 లక్షల వరకు ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల నుంచి రికవరీ చేశారు. మిగిలిన సొమ్ము ఎలా రికవరీ చేయాలన్న సందిగ్ధంతో రెగ్యులర్‌ ఉద్యోగులను విధుల్లోకి చేర్చుకోలేదు.

ABOUT THE AUTHOR

...view details