మూడు వారాలుగా ఉపాధి పనులు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఉపాధి హామీ కూలీలు సీపీఎం ఆధ్వర్యంలో కర్నూలులో ఆందోళన చేపట్టారు. 99 గ్రామాల్లో ఉన్న క్షేత్ర స్థాయి సహాయకుని మారడం.. ప్రస్తుతం నియమించిన సహాయకుడు పనులు చూపించకపోవడం.. తమ సమస్యలు పెంచుతోందన్నారు.
పనిలేని ఉపాధి కూలీలకు ఉపాధి కల్పించాలని సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కల్పిస్తామని ఏపీఓ వారికి నచ్చజెప్పారు.