గోరుకల్లులో ఉపాధి హామీ కూలీల ఆందోళన - గోరకల్లులో ఉపాధి హామి కూలీల ధర్నా న్యూస్
కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు సచివాలయం వద్ద ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. రాజకీయ ప్రలోభాలకు లోనై గ్రామానికి చెందిన ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిని తొలగించ వద్దని అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.

గోరుకల్లులో ఉపాధి హామీ కూలీల ఆందోళన
రాజకీయ ప్రలోభాలకులోనై అధికారులు క్షేత్ర సహాయకులని తొలగించవద్దని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లులో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. గ్రామంలో సచివాలయం ఎదుట కూలీలు నిరసనకు దిగారు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి గ్రామానికి చెందిన ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు రవికుమార్‌ను తొలగించవద్దని ఆందోళన వ్యక్తంచేశారు. అతడినే క్షేత్ర సహాయకుడిగా కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.