ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలి: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి - కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే

గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం భాజపా ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని.. ప్రపంచంలో ఏ దేశంలో ఇలాంటి చట్టం లేదని అన్నారు.

cow slaughter Prohibition Act
గోవధ నిషేద చట్టం

By

Published : Jul 25, 2021, 10:27 AM IST

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..

గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాలం చెల్లిన పాత చట్టాల్లో ఒకటని.. ఓట్ల కోసం భాజపా ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఆర్​ఎస్ఎస్ దాని అనుబంధ సంస్ధలు మతసామరస్యాన్ని దెబ్బ తీస్తున్నాయన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఇలాంటి చట్టం లేదన్నారు. హిందువులకు గోవు పూజ్యనీయమైనదని.. కానీ ముస్లింలకు ఆహార పదార్థము అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details