ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంబరాల్లో మునిగి తేలారు..కరోనా ఊసే మరిచారు - ఎమ్మిగనూరులో పరుగు పందేలు

ఏరువాక వచ్చిందంటే చాలు..రైతులు పొలాల సాగులో లీనమైపోతుంటారు. కొన్ని ప్రాంతాలలో ఏరువాకను ప్రత్యేకంగా పరుగుపందేలు జరిపి వేడుకలాగా నిర్వహిస్తుంటారు. కానీ ఓ ప్రాంతంలో కరోనా కాలం కాబట్టి వేడుకలు చేసుకోవద్దని అధికారులు సూచించినా.అక్కడి ప్రజలు పట్టించుకోలేదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రాణాల కంటే పరుగు పందాలే ముఖ్యమని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

running race in emmiganur at karnool ditsrict
ఎమ్మిగనూరులో పరుగు పందేలు

By

Published : Jun 6, 2020, 12:36 PM IST

Updated : Jun 6, 2020, 12:59 PM IST

ఎమ్మిగనూరులో పరుగు పందేలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పలు గ్రామాల్లో పరుగు పందేలు నిర్వహించారు. కరోనా ఉన్నందున ఈసారి గ్రామీణ సంబరాలకు దూరంగా ఉండాలని పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు. పరుగు పందేల వద్ద ప్రజలు గుంపులుగా చేరి పోటీలను తిలకించారు. అసలు భౌతికదూరం, మాస్కులు పెట్టుకోవాలనే ఊసే మర్చిపోయి.. ప్రాణాల కంటే సంబరాలే ముఖ్యమనే విధంగా వ్యవహరించారు.

Last Updated : Jun 6, 2020, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details