ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

video viral: తల్లిపై మున్సిపల్ ఛైర్మన్ దౌర్జన్యం.. అసలేం జరిగింది? - ap latest news

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ రఘు.. తన తల్లిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మున్సిపల్ కౌన్సిలర్ అయిన సరోజమ్మపై.. తన కుమారుడు దౌర్జన్యానికి పాల్పడ్డ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. రఘుకు.. తన తల్లిదండ్రులు, సోదరుడితో ఆస్తి వివాదాలున్నట్లు తెలుస్తోంది.

emmiganur municipal chairman attack on his mother
తల్లిపై దౌర్జన్యానికి దిగిన ఎమ్మిగనూరు మున్సిపల్‌ ఛైర్మన్‌

By

Published : Dec 22, 2021, 8:10 PM IST

Updated : Dec 22, 2021, 9:47 PM IST

తల్లిపై దౌర్జన్యానికి దిగిన ఎమ్మిగనూరు మున్సిపల్‌ ఛైర్మన్‌

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ రఘు.. తన తల్లి, మున్సిపల్ కౌన్సిలర్ అయిన సరోజమ్మపై దౌర్జన్యానికి పాల్పడిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ విషయంలో రఘుపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ రఘుకు, తన తల్లిదండ్రులు, సోదరుడితో.. ఆస్తి వివాదాలున్నట్లు తెలుస్తోంది.

ఛైర్మన్‌ తమను ఇబ్బంది పెడుతున్నాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం న్యాయమూర్తిని కలిసి అర్జీ ఇచ్చారు. తమపై పెద్ద కుమారుడు ఛైర్మన్ రఘు భార్య కలిసి ఆస్తి కోసం వేధిస్తున్నారని తనపై దాడి కూడ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లిపై.. రఘు దౌర్జన్యానికి పాల్పడ్డ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Last Updated : Dec 22, 2021, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details