ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ జిల్లాల అధికారులనే ఎందుకు బదిలీ చేశారు..?' - దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణి సంస్థ

కర్నూలు సర్కిల్​లో పనిచేస్తున్న వివిధ విభాగాల అధికారులను... తెలంగాణ ప్రాంత విద్యుత్ సంస్థకు బదిలీ చేశారని ఆ సంస్థ ఉద్యోగులు వాపోయారు. కర్నూలు ఎంపీ డా.సంజీవ్​కుమార్​ను కలిసి వారి సమస్యలను వివరించారు.

electricity Employees  problems at karnool
కర్నూలు ఎంపీతో మాట్లాడుతున్న విద్యుత్ ఉద్యోగులు

By

Published : Mar 19, 2020, 3:58 PM IST

కర్నూలు ఎంపీతో మాట్లాడుతున్న విద్యుత్ ఉద్యోగులు

దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కర్నూలు సర్కిల్​లో పనిచేస్తున్న వివిధ విభాగాల అధికారులను... తెలంగాణ ప్రాంత విద్యుత్ సంస్థకు బదిలీ చేశారు. కర్నూలు ఎంపీ డా.సంజీవ్​కుమార్​ను ఆ సంస్థ ఉద్యోగులు కలిసి వారి సమస్యలను చెప్పారు. ఆకస్మాత్తుగా సీనియర్ అధికారులను బదిలీ చేశారని వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచే బదిలీ చేయడం సరికాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details