కూలిన విద్యుత్ స్తంభాలు.. గ్రామస్థుల ఆందోళన - streetpoles
పెద్దకడబూరులో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో గ్రామంలో అంధకారం నెలకొంది. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.

గాలివానకు కూలిన విద్యుత్ స్తంభాలు
గాలివానకు కూలిన విద్యుత్ స్తంభాలు
నైరుతి రుతుపవనాల రాకకు ముందే రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వర్షాలు పలకరిస్తున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరులో గాలివానకు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. నాలుగు రోజులుగా ప్రజలు అంధకారంలో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంపై గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.