కర్నూలు జిల్లా గూడూరు పంచాయతీలో ఎన్నికల దృష్ణా నాయకుల ప్రచారాలు ఊపందుకున్నాయి. భాజపా, తెదేపా, వైకాపాల ఆధ్వర్యంలో తమ అభ్యర్థుల తరపున రోడ్ షో కార్యక్రమాలు ముమ్మరంగా జరిగాయి. భాజపా అభ్యర్థులను బలపరిచేందుకు రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి, పార్లమెంటు బాధ్యులు డాక్టర్ పార్థసారథి.. వైకాపా అభ్యర్థులు బలపరిచేందుకు కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, కోట హర్షవర్ధన్ రెడ్డి.. తెదేపా తరపున మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ప్రచారం చేశారు.
గూడూరు నగర పరిధిలో 20 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ వార్డులో గెలుపొంది నగర పీఠాన్ని సాధించడం కోసం ముఖ్య నేతలు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు. తెదేపా తరపున సూజాతమ్మ, వైకాపా తరపున కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి ఇద్దరూ ఒకే కుటుంబం అయినా పార్టీల పరంగా వేరువేరుగా ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది.