ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురపోరులో జోరుగా ప్రచార హోరు - కర్నూలు జిల్లాలో వైకాపా ఎన్నికల ప్రచారం

నేటితో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనుండగా కర్నూలు జిల్లాలో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది.

election campaign in kurnool district
పురపోరులో జోరుగా ప్రచార హోరు

By

Published : Mar 8, 2021, 5:01 PM IST

Updated : Mar 8, 2021, 5:09 PM IST

కర్నూలు జిల్లాలో అభ్యర్థులు ప్రచారం తారాస్థాయికి చేరింది. నేటితో గడువు ముగుస్తుండటంతో అభ్యర్థులు తరఫున పార్టీల ముఖ్య నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారాలు నేటితో ముగియనున్నాయి. కార్పొరేషన్​లోని రెండు వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 50 వార్డుల్లో తెదేపా, వైకాపాల మధ్య పోటీ నెలకొంది. 29వ వార్డులో ఓ ఇంటి ముందు 'ఓట్లు అమ్మబడవు' అని బోర్డు పెట్టి.. సమస్యలు పరిష్కరించాలని ప్రచారానికి వెళ్లిన వైకాపా అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని కోరారు.

నంద్యాలలో...

నంద్యాల అయిదో వార్డులో సీపీఐ అభ్యర్థి బాబా ఫక్రుద్దీన్ తరుఫున సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇంటింటి ప్రచారం చేశారు. వైకాపా ప్రభుత్వ పథకాలు పనిచేస్తే బలవంతపు ఏకగ్రీవాలు ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్రజండా మాత్రమేనన్నారు.

ఎమ్మిగనూరులో...

ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో పలు వార్డుల్లో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలపై పన్నుల భారం వేయకుండా అభివృద్ధి చేస్తామన్నారు.

ఇదీ చదవండి

జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం..

Last Updated : Mar 8, 2021, 5:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details