ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విద్యుత్‌ కాటుకు తల్లీ, కుమార్తె బలి' - kurnool

తల్లి విద్యుదాఘాతానికి గురైంది. ఇది గమనించిన కుమార్తె తల్లిని కాపాడేందుకు ప్రయత్నించింది...మృత్యువు రూపంలో కరెంట్ ఇద్దరిని బలిగొన్నది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది

'కరెంట్ కాటుకు తల్లీ, కుమార్తె బలి'

By

Published : Jul 6, 2019, 5:51 AM IST

కర్నూలు జిల్లా తిప్పలదొడ్డిలో విద్యుదాఘాతానికి తల్లి, కుమార్తె మృతి చెందారు. కుమార్తెతో కలిసి నర్సమ్మ తన సోదరుడి పొలంలో పత్తి విత్తనాలు వేసేందుకు వెళ్లారు. భోజనం చేసేందుకు చెట్టు కింద కూర్చున్నారు... లేచే క్రమంలో నర్సమ్మ కొమ్మలకు వేలాడుతున్న విద్యుత్ తీగలను పట్టుకోగా...ఆమెకు షాక్ కొట్టింది. తల్లిని కాపాడేందుకు యత్నించిన కుమార్తె రామాంజనమ్మ సైతం... ఆ తీగలను పట్టుకొని ఆమె కూడా కరెంట్ కాటుకు బలైంది. తల్లి, కుమార్తెల మరణ వార్తతో గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. బంధువులు భాధ వర్ణనాతీతంగా మారింది.

'కరెంట్ కాటుకు తల్లీ, కుమార్తె బలి'

ABOUT THE AUTHOR

...view details