కుక్కల దాడిలో ఎనిమిది గొర్రెలు మృత్యువాతపడ్డ ఘటన కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడులో జరిగింది. గ్రామానికి చెందిన జయన్నకు12 గొర్రెలు ఉన్నాయి. అయితే రాత్రి ఆ మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 8 మృతిచెందగా... మరో 4 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో వాటినే ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం రోడ్డునపడే పరిస్థితి నెలకొంది.
గ్రామంలో కుక్కలు బెడద అధికంగా ఉందని పలు మార్లు గ్రామ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అయిన ఫలితం లేదని బాధితుడు జయన్న అన్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని జయన్న విజ్ఞప్తి చేస్తున్నాడు.