ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్పందన: ఆక్రమణలపై కదిలిన ఉన్నతాధికారులు - బనగానపల్లెలో జుర్రేరు వాగు తాజా వార్తలు

కర్నూలు జిల్లా బనగానపల్లెలోని జుర్రేరు వాగు ఆక్రమణకు గురి అవుతున్నట్టు ఈనాడు - ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. స్థానిక తహసీల్దార్ ఆల్ఫ్రెడ్.. ఆర్​ఐ, సర్వేయర్​లతో కలిసి ఆక్రమణకు గురవుతున్నట్టు వచ్చిన సర్వే నెంబర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయినట్లు తేలితే... చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.

eenadu etv bharat effect on illegal  occupancy at jurreru lake
ఈనాడు-ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన అధికారులు

By

Published : Dec 29, 2020, 1:09 PM IST

కర్నూలు జిల్లా బనగానపల్లెలో జుర్రేరు వాగు ఆక్రమణకు గురి అవుతున్నట్టు ఈనాడు - ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై.. అధికారులు స్పందించారు. తహసీల్దార్ ఆల్ఫ్రెడ్... ఆక్రమణకు గురి అవుతున్నట్టు వచ్చిన సర్వే నెంబర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్ఐ ప్రవీణ్ కుమార్, సర్వేయర్ భాషాలతో కలిసి అధికారిక రికార్డులు తనిఖీ చేశారు.

వాగుకు సంబంధించి చిన్న నీటి పారుదల శాఖ అధికారులకు లేఖ పంపిస్తామని తహసీల్దార్ చెప్పారు. నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పూర్తిస్థాయిలో ఆయా సర్వే నెంబర్లను విచారణ చేయించి.. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయినట్లు రుజువైతే యజమానులకు నోటీసులు పంపిస్తామని.. తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details