ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

E-NAM FRAUD: రికార్డుల్లో ఈ-నామ్‌ విధానం.. కొనుగోళ్లలు మాత్రం బహిరంగ వేలంలో - కర్నూలు జిల్లా ఉల్లి రైతుల గోస

కర్నూలు ఉల్లి మార్కెట్​లో ఈ-నామ్ ముసుగు(E-nam fraud in Kurnool Onion Market)లో రైతులకు వ్యాపారులు ఎగనామం పెడుతున్నారు. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు, అధికారులు కుమ్మక్కవ్వటంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. బహిరంగ వేలంలో తక్కువ ధరకే ఉల్లిని విక్రయించి నష్టాలు మూటగట్టుకుంటున్నారు.

fraud in Kurnool Onion Market
కర్నూలు ఉల్లి మార్కెట్​లో మోసాలు

By

Published : Oct 24, 2021, 5:13 AM IST

కర్నూలు ఉల్లి మార్కెట్​లో ఈ-నామ్ ముసుగు రైతులకు ఎగనామం

కర్నూలు ఉల్లి మార్కెట్‌(Kurnool Onion Market)లో ఈ ఏడాది ఆగస్టు 28 నుంచి ఉల్లి కొనుగోళ్లను ఈ-నామ్ విధానం ద్వారా(E-nam fraud in Kurnool Onion Market) చేపడుతున్నట్లు అధికారులు ప్రకటించారు. కొన్ని రోజులు సజావుగా జరిగినా తమకు నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు కొనుగోళ్లను నిలిపేశారు. దీంతో సుమారు నెల రోజులు మార్కెట్ మూతపడింది. మళ్లీ వ్యాపారులతో అధికారులు చర్చలు జరపి ఈ-నామ్‌(E-NAM)లోనే కొనేలా ఒప్పించారు. ఒకటి రెండు రోజులు ఈ పద్ధతిలో లావాదేవీలు జరిగినా తమకు మళ్లీ నష్టాలు వస్తున్నాయన్న సాకుతో వ్యాపారులు బహిరంగ వేలం ద్వారానే కొనుగోళ్లు చేపట్టారు. రికార్డుల్లో మాత్రం ఈ-నామ్ విధానంలో కొనుగోలు చేస్తున్నట్లు నమోదు చేస్తున్నారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి దిగుబడులు తగ్గగా రైతన్నలకు మాత్రం పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఎకరాకు 60 నుంచి 80 వేల రూపాయల వరకు అన్నదాతలు ఖర్చు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లికి మంచి డిమాండ్ ఉన్నా కర్నూలు ఉల్లి మార్కెట్ లో ధరలు భారీగా తగ్గాయి. క్వింటాలు ఉల్లికి కనిష్ఠంగా 3 వందలు గరిష్ఠంగా 2వేల 300 రూపాయలు మాత్రమే పలుకుతోంది. నాణ్యమైన ఉల్లిగడ్డకు 2 వేల రూపాయలు కూడా రావటం లేదని రైతులు వాపోతున్నారు.

రైతులకు ఈ-నామ్‌ విధానంలోనే మేలు జరుగుతోందని.. మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. ఈ-నామ్ విధానంలో కొనుగోలు చేస్తామని చెప్పి బహిరంగ వేలం ద్వారా కొంటున్న వ్యాపారులపై చర్యలు తీసుకుంటాని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ-నామ్ విధానంలో ఉల్లిని కొనుగోలు చేయటం వల్ల వ్యాపారుల మధ్య పోటీ పెరుగుతుంది. ఫలితంగా రైతు పండించిన పంటకు మంచి ధరలు వస్తాయని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు..

ABOUT THE AUTHOR

...view details