SRISAILAM : అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా ఉత్సవాలు సందడి మొదలైంది. నేటి నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీశైలం మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాలను రంగురంగు విద్యుత్ దీపాలు , తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల తోరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈరోజు ఉదయం ఉత్సవాలకు ప్రారంభ పూజలు జరుగుతాయి. సాయంత్రం భ్రమరాంబా దేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
నేటి నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు.. శైలపుత్రి అలంకారంలో అమ్మవారి దర్శనం
Dussehra At Srisailam : శ్రీశైలంలో దసరా ఉత్సవాల సందడి మొదలైంది. నేటి నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Dussehra At Srisailam