ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Dussehra celebrations: రాష్ట్రవ్యాప్తంగా ముగిసిన దసరా ఉత్సవాలు... చివరిరోజు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు - east godavari district news

తొమ్మిది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కన్నులపండువగా జరిగిన దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ముగిశాయి. చివరిరోజు పలుచోట్ల ఊరేగింపు కోలాహలంగా జరిగింది. అమ్మవారితో పాటు జమ్మి చెట్టుకు భక్తులు ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.

Dussehra celebrations
Dussehra celebrations

By

Published : Oct 16, 2021, 5:37 AM IST

రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు(Dussehra celebrations) ముగిశాయి. 9 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు... ఉత్సవాల్లో ఆఖరి రోజున ఊరేగింపు నిర్వహించారు. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు(Dussehra celebrations in srisailam temple) అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్సవాల చివరిరోజు రాత్రి శ్రీభ్రమరాంబ దేవి భక్తులకు నిజరూప అలంకారంలో దర్శనమిచ్చారు. నంది వాహనంపై కొలువుదీరి పూజలందుకున్నారు. ఆలయ ఉత్సవం, శమీ పూజల తర్వాత... పుష్కరిణిలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల తెప్పోత్సవం శోభాయమానంగా జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా ముగిసిన దసరా ఉత్సవాలు... చివరిరోజు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

యువకుల నృత్యాలు..

శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో కుంకుమ పూజలు చేశారు. వర్షం కారణంగా తిరువీధిని రద్దు చేసిన అధికారులు ఆలయ దక్షిణద్వారం నుంచి తూర్పు ద్వారం వైపుగా అమ్మవారిని ఆలయంలోనికి చేర్చారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం పాపయ్యవలసలో... ఆఖరి రోజు ఉత్సవాలు సందడిగా జరిగాయి. విశాఖ మన్యం పాడేరులో జరిగిన అమ్మవారి ఊరేగింపులో యువకులు నృత్యాలతో అలరించారు.

గోదావరి హారతి..

విజయదశమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా(east godavari district) రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో గోదావరి హారతి కన్నులపండువగా జరిగింది. వేదపండితుల మంత్రాల నడుమ 14 హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి.అంతర్వేది పెద్దచెరువులో కనకదుర్గమ్మ తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఒంగోలు గొడుగుపాలెంలో దసరా ఉత్సవాల ఆఖరి రోజున పార్వేట ఉత్సవం కన్నులపండువగా సాగింది. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో శ్రీ అంకమ్మతల్లి దేవాలయంలో ఉత్సవాల చివరిరోజున ప్రత్యేక పూజలు చేశారు. కనిగిరిలో శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

అనంతపురం జిల్లా పెనుకొండలో వివిధ ఆలయాల్లోని ఉత్సవ విగ్రహాల జంబూ సవారీని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కర్నూలు జోహారాపురం వద్ద ఉన్న జమ్మి చెట్టు వద్ద భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకున్నారు.

ఇదీ చదవండి

ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు.. చివరిగా హంసవాహనంపై దర్శనం

ABOUT THE AUTHOR

...view details