కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల గర్భిణులకు నిర్వహించే ఉచిత స్కానింగ్ పరీక్షలు కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయాయి. ఇక్కడ ప్రతీ నెల 200 మందికి పైగా స్కానింగ్ పరీక్షలు చేస్తారు.
ఈ సారి కూడా అలాగే చేస్తారని... ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి గర్భిణులు ఆసుపత్రికి వచ్చారు. కానీ లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ఆసుపత్రుల సేవల కోసం గంటల తరబడి నిరీక్షించి.. చేసేదిలేక వెనుదిరిగారు.