ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయ డెయిరీకి కరోనా ఎఫెక్ట్ - విజయా డైరీపై లాక్ డౌన్ ఎఫెక్ట్ వార్తలు

కరోనా మహమ్మారి కారణంగా మూతపడని సంస్థ ఉందా..! అన్నీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను నిలిపివేయక తప్పలేదు. దాని ఫలితం.. నష్టాలను చవిచూడటం. అందులో విజయ డెయిరీ కూడా ఒక్కటి.

due to corona lockdown effect on vijaya dairy lossed kurnool
due to corona lockdown effect on vijaya dairy lossed kurnool

By

Published : May 29, 2020, 8:05 PM IST

విజయ డైరీకి కరోనా దెబ్బ!

కరోనా లాక్ డౌన్ తరుణంలో విజయ పాల ఉత్పత్తుల అమ్మకాలు పడిపోయాయి. ఈ సంస్థ ఉత్పత్తి చేసే పాలు, నెయ్యి, పెరుగు, మజ్జిగతో పాటు తదితర ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. శ్రీశైలం, మహానంది, మంత్రాలయం, కసాపురం తదితర ప్రముఖ ఆలయాలకు నంద్యాలలోని విజయ పాల డెయిరీ... 18 టన్నుల నెయ్యిని సరఫరా చేసేది. పలు శుభకార్యాలకు పెరుగు అందించడంతో పాటు రోజుకు లక్ష మజ్జిగ ప్యాకెట్లను విక్రయించేది. కానీ ప్రస్తుత పరిస్థితిలో 15 వేల ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేస్తోంది.

లాక్​డౌన్ కారణంగా అమ్మకానికి నోచుకోక సంస్థకు సుమారు రూ.5 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద రెడ్డి తెలిపారు. నష్టాలను పూడ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తామని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:'ప్రభుత్వ ఉద్దీపనలతో సానుకూల ఫలితాలు'

ABOUT THE AUTHOR

...view details