కర్నూలు జిల్లాలో భార్యాభర్తల మధ్య కరోనా వైరస్ చిచ్చుపెట్టింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆంజనేయులు తెలంగాణలోని మిర్యాలగూడలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య శ్యామల పిల్లలతో కలిసి కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ములుగుందంలో ఉంటోంది. లాక్‌డౌన్‌తో పని లేకపోవటంతో ఆంజనేయులు సొంతూరికి తిరిగి వచ్చాడు. అయితే కరోనా పరీక్ష చేయించుకోకుంటే ఇంట్లోకి రావద్దంటూ శ్యామల అభ్యంతరం తెలిపింది. పరీక్షలు చేయించడానికి అతనిని ఆసుపత్రికి తీసుకువచ్చింది.
కరోనా భయం..భర్తను ఇంట్లోకి రానివ్వని భార్య - కాపురంలో కరోనా చిచ్చు
ప్రాణాలను తీసే కరోనా మహమ్మారి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తెచ్చింది. పట్టణం నుంచి వచ్చిన భర్తకు కరోనా ఉందేమోనన్న అనుమానంతో ఇంట్లోకి రానివ్వలేదు భార్య. కరోనా పరీక్షలు చేయించుకున్నాకే ఇంట్లోకి అడుగు పెట్టాలని తేల్చి చెప్పింది.
![కరోనా భయం..భర్తను ఇంట్లోకి రానివ్వని భార్య due to corona fear women did not let her husband into the house](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6573626-920-6573626-1585392602311.jpg)
due to corona fear women did not let her husband into the house