కర్నూలులో లాక్డౌన్ను అధికారులు కట్టుదిట్టం చేశారు. నగరంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో 30 రైతుబజార్లు ఏర్పాటు చేయగా... నేడు కేవలం ఆరు ప్రాంతల్లో మాత్రమే రైతు బజార్లను అందుబాటులో ఉంచారు. నిత్యావసర వస్తువులు తీసుకునేందుకు ప్రజలు కిరాణం షాపుల ముందు బారులు తీరారు. కొన్ని చోట్ల భౌతిక దూరం పాటిస్తున్నా.. మరికొన్ని చోట్ల ప్రజలు ఇవేం పట్టించుకోకుండా సరుకులను కోనుగోలు చేస్తున్నారు.
లాక్ డౌన్ ప్రభావం: 30 నుంచి 6 కి తగ్గిన రైతుబజార్లు - కర్నూలులో కరోనా వార్తలు
కర్నూలులో కరోనా వ్యాపిస్తున్న వేళ.. అధికారులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ మేరకు నగరంలో 30 ఉన్న రైతు బజార్లను 6కు కుదించగా.. దుకాణాల ముందు ప్రజలు బారులు తీరారు.
due to corona and lockdown kurnool raithubazars are reduced