ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెంచు యువకులకు డ్రైవింగ్ లైసెన్సులు

నాటుసారా వృత్తిగా జీవనాన్ని సాగించే చెంచుల్లో మార్పు తెచ్చే కార్యక్రమానికి పోలీసులు, రవాణా శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. వారికి డ్రైవింగ్ పై శిక్షణ ఇచ్చి లైసెన్స్​లు అందజేశారు.

By

Published : Jan 9, 2021, 12:47 PM IST

డ్రైవింగ్ లైసెన్స్​లను అందించిన పోలీసులు
డ్రైవింగ్ లైసెన్స్​లను అందించిన పోలీసులు

కర్నూలు జిల్లా పాణ్యంలో నాటుసారా వృత్తిగా జీవనాన్ని సాగించే చెంచుల్లో మార్పు కోసం పోలీసులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. పరివర్తన పేరుతో పాణ్యం ఇందిరానగర్​కు చెందిన కొంతమంది యువకులకు డ్రైవింగ్ పై శిక్షణ ఇచ్చి లైసెన్స్​లు అందజేశారు. ఇకపై నాటుసారా అమ్మవద్దని..ఏదైనా వాహనాలను నడుపుతూ..జీవనాన్ని సాగించాలని లైసెన్స్ పొందిన యువకులకు రవాణా శాఖ అధికారులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details