ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాయకరావుపేటలో తనిఖీలు.. భారీగా నిలిచిన వాహనాలు - విశాఖ జిల్లా, సరిహద్దు పాయకరావుపేట

విశాఖ జిల్లా సరిహద్దు పాయకరావుపేటలో ప్రత్యేక చెక్ పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. అన్ని అనుమతులతో జిల్లా సరిహద్దు దాట్టాల౦టే జిల్లా పోలీసులు తనిఖీల పేరుతో వాహన చోదకులకు చుక్కలు చూపిస్తున్నారని పలువురు వాపోతున్నారు. పోలీసు అధికారుల తీరుపై ప్రయాణాలు సాగించే వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

vishaka district
తనిఖీల పేరుతో చోదకులకు, ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తున్నారు

By

Published : May 6, 2020, 5:43 PM IST

విశాఖ జిల్లా సరిహద్దు పాయకరావుపేటలో ప్రత్యేక చెక్ పోస్టు ఏర్పాటు చేసిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంటల తరబడి వాహనాలను రహదారిపై ఆపివేశారు. కిలోమీటర్ల పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఎండలో రోగులు, చిన్నారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అక్కడ చిక్కుకున్న వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలను..అత్యవసర పనుల పై వెళ్లేవారు, ఆసుపత్రికి వెళ్లే రోగులు, వృద్ధులు ముందస్తు అనుమతి పత్రాలు తీసుకుంటున్నారు. ఈ అనుమతి పత్రాలు తనిఖీ చేసి సమయంలో కొంత గందరగోళం నెలకొంటోంది. తనిఖీ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేక ఎండలో నిల్చొని అనుమతి పత్రాలు చూపించాలిసిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన చెందారు. తనిఖీ ప్రక్రియను కాస్త సులభతరం చేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details