కర్నూలు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించాలని... నగరవాసులు సీపీఎం నేతల ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నగరంలోని జోహరాపురానికి పదిరోజులుగా మంచినీటి సరఫరా చేయలేదంటూ ఆందోళనకు దిగారు. కనీసం ట్యాంకులతో అయినా.. నీరు పంపడం లేదని ఆగ్రహించారు. అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన చెందారు. త్వరగా మంచినీటి సరఫరాపై దృష్టి పెట్టాలని కోరారు.
'తాగునీటి సమస్యను పరిష్కరించాలి' - కర్నూలు నగరపాలక సంస్థ
తాగునీటిని సమస్యను పరిష్కరించాలంటూ... కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు, నగరవాసులు ధర్నా చేశారు.

'తాగునీటి సమస్యను పరిష్కరించాలి'
తాగునీటి సమస్యను పరిష్కరించాలని ధర్నా చేస్తున్న నగరవాసులు
ఇవీ చదవండి..ఆదివాసీల అభ్యున్నతికి కృషి: మాయా చింతామన్