ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయోధ్య శ్రీ రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ - కర్నూలు జిల్లా తాజా వార్తలు

అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు కేంద్ర ధర్మ రక్షణ నిధి సహాయకుడు సత్యంజీ బుధవారం కర్నూలు జిల్లా డోన్​కు వచ్చారు. ప్రతి హిందువు ఆలయనిర్మాణానికి తమవంతు విరాళం అందించాలని కోరారు.

donation to ayodya rama temple construction
అయోధ్య శ్రీ రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ

By

Published : Dec 30, 2020, 7:04 PM IST

అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి సమస్త సమాజం నుండి సాత్విక సహకారాన్ని కోరుతూ నిధి సమర్పణ పిలుపులో భాగంగా కేంద్ర ధర్మ రక్షణ నిధి సహాయకుడు సత్యంజీ బుధవారం కర్నూలు జిల్లా డోన్ వచ్చారు. డోన్​కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గుంటూరు సుబ్బారావు రూ.10 లక్షల చెక్​ను సత్యంజీకి అందజేశారు.

దేశంలోని వ్యాపారవేత్తలు స్వయంగా రామమందిరాన్ని నిర్మిస్తామని ముందుకు వచ్చినా.. నిరాకరిస్తూ దేశంలోని ప్రతి హిందువు నుంచి సహాయ నిధిని సేకరించి రామమందిర నిర్మాణం చేపడతామని అన్నారు. ప్రతి హిందువు బాధ్యతగా భావించి సహాయనిధికి విరాళం అందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details